Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కబడ్డీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపిక

కబడ్డీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జాన్ పాల్ నాయక్ అనే విద్యార్థి అండర్-16 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కల్లెడ నగేష్ తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో జరిగే 35వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో జాన్ పాల్ నాయక్ పాల్గొంటాడని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జాన్ పాల్ నాయక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, జిల్లా కబడ్డీ  అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ అభినందించారు. రాష్ట్ర స్థాయి  పోటీలలో మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -