క్రీడా పోటీలకు తెలంగాణ జట్టుకు జిల్లా క్రీడాకారిణి..
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 71వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు సన్నదత శిబిరానికి ఎంపిక చేయడం జరిగింది. వీరికి ఈనెల 19 నుండి 21 వరకు హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్ మారుతి బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ లో శిక్షణ శిబిరం నిర్వహించి ఇందులో నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను తెలంగాణ జట్టుకు ఎంపిక చేశారు. ఇందులో నిజామాబాద్ జిల్లా క్రీడాకారుని ఓ.స్పూర్తి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ రెంజల్ క్రీడాకారుని తెలంగాణ జట్టుకు ఎంపికైనారు.
ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుండి 29 వరకు తమిళనాడు లోని PSNL కాలేజ్ దిండిగల్ లో జరిగే 71వ జాతీయస్థాయి సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక కావటం పట్ల జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్, ప్రధాన కార్యదర్శి B.శ్యామ్, సలహాదారులు ఎన్వి హనుమంత్ రెడ్డి,జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్ , కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్సింగ్ రావు, కృష్ణమూర్తి , ఉపాధ్యక్షులు కిషన్ ,కిషోర్, రంజిత్, రాజ్ కుమార్ PD,కోశాధికారి రాజేశ్వర్, సంఘ సభ్యులు అభినందించారు.