Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్ఓబిపై ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతుపై వాన పడ్డట్లుంది

ఆర్ఓబిపై ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతుపై వాన పడ్డట్లుంది

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నిజామాబాద్ జిల్లాలోని నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) నిర్మాణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పిన దున్నపోతుపై వాన కురిసినట్టు ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు దానిమ్మపూడి అరవింద్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయంలో దిశ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక లో జరిగిన అవినీతి లో ఇక్కడి కాంగ్రెస్ నేతలు వాటాలు పొందారు. అందుకే మౌనంగా ఉంటున్నారు. ఇటివల కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అల్మట్టి పెంచుతామని చెస్తున్న ప్రకటనలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పైర్ అయ్యారు.

ఆల్మట్టి ఎత్తు కాదు… రేవంత్ నీ ఎత్తు పెంచుకో అంటూ సెటైర్లు వేశారు. అల్మట్టి పెంచుతా మంటున్న ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పిన దున్నపోతు పై వాన కురిసినట్టు ఉందన్నారు. జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉన్నా, ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నిధులు ఇప్పించకపోవటం సిగ్గుచేటు అన్నారు. ఆర్వోబీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు.

అందుకే పనులు ఆలస్యం అవుతున్నాయి అని తెలిపారు. కేంద్రం నుండి వచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారు అని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిధుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన చేపట్టాలని ఎమ్మెల్యేలు, పార్టి లీడర్లకు పిలుపు నిచ్చారు. ఎంపీ ల్యాండ్ నిధులతో చేపట్టిన పనులు కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు.వరదల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదు.. రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవటం దారుణం అన్నారు. రైతులకు జరిగిన నష్టంపై మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని పథకాల్లో స్కాములు చేస్తుంది అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్ల లో సైజులను తగ్గించి కోతలు విధిస్తున్నారు అని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -