Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యం: ఎమ్మెల్యే ధన్ పాల్

నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యం: ఎమ్మెల్యే ధన్ పాల్

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
శ్రీనగర్ కాలనీ 45 డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  నగర మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. బాలహనుమాన్ మందిరం పక్కన ఉన్న అండర్ బ్రిడ్జ్ పాడైపోయి ఉన్నందున వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్నా క్రమంలో దాన్ని ప్రస్తుతం మరమ్మత్తు చేసి శాశ్వత పరిష్కారంగా డీపీర్ తయారు చేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాం అని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునః నిర్మాణం చేపట్టాలని కమీషనర్ కి సూచించారు. రాష్ట్రంలో నిజామాబాదు కార్పొరేషన్ ను పారిశుధ్యంలో మొదటిస్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి & సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.

నగరంలోని వీధి ద్విపాల కోరత పెద్ద మొత్తంలో ఉందని వీలైనంత త్వరగా వీధి ద్విపాలు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. నిజామాబాదు కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు బీటీ,సీసీ రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ జీమ్, పార్కుల అభివృద్ధి,కల్వర్టుల నిర్మాణానికి స్పెషల్ ఫండ్ వంద కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. నియోజకవర్గం అభివృద్దే తన లక్ష్యం అని నగర ప్రజలకు మౌలిక సౌకర్యల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

రాత్రి సమయంలో ఆకాతాయిలు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే  ఏసీపీకి మాట్లాడి రాత్రిసమయంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించేల చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో మున్సిపల్ ఏఈ పావని , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, స్థానిక నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేష్, బొబ్బిలి వేణు, ఎరన్న బీజేపీ నాయకులు పవన్, ఆనంద్,కాలోని వాసులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -