Wednesday, September 24, 2025
E-PAPER
Homeకరీంనగర్వేములవాడ హత్యకేసును ఛేదించిన పోలీసులు

వేములవాడ హత్యకేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

– ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ..
భూమి వివాదమే రమేష్ హత్యకు దారితీసింది..
ఒక ప్రకటనలో తెలిపిన అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ

ఇటీవల వేములవాడలో చోటుచేసుకున్న రియల్టర్‌ సిరిగిరి రమేష్ హత్యకేసును పోలీసులు చేదించారు. భూమి వివాదం నేపథ్యంగా పథకం ప్రకారం ఈ దారుణ హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. మంగళవారం అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చందుర్తిలోని భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్‌పై పెట్రోల్ బంక్ కోసం రమేష్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చిర్రం రవి, తరువాత భూమి తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో భూమి తనకు దక్కాలనే ఉద్దేశంతో చిర్రం రవి, ఎద్దండి వెంకటేష్, అలా వంశీలను హత్యకు సుపారి ఇచ్చినట్లుగా తెలిపారు.

సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పెద్దూరు సబ్‌స్టేషన్ సమీపంలో రమేష్ కారు ఆపి నిద్రిస్తున్నప్పుడు, అలా వంశీ కాళ్లు పట్టుకోగా, చిర్రం రవి వెనుక సీట్లో కూర్చొని గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం డ్రైవర్ సీటులో కూర్చున్న ఎద్దండి వెంకటేష్ కత్తితో రమేష్ గొంతు, ఛాతిపై పలు సార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వేములవాడ నంది కమాన్ సమీపంలోని నందీశ్వర టౌన్‌షిప్ వెంచర్‌లో వదిలేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పరారవుతుండగా, వేములవాడలోని సాయిరక్ష దాబా సమీపంలో పోలీసులు ఎద్దండి వెంకటేష్, అలా వంశీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఇన్నోవా కారు, మొబైల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం మాస్టర్‌మైండ్ చిర్రం రవి పరారీలో ఉన్నారని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని ఆమె వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -