Wednesday, September 24, 2025
E-PAPER
Homeమానవిట్రావెలింగ్‌లో ఇబ్బందిపడుతున్నారా?

ట్రావెలింగ్‌లో ఇబ్బందిపడుతున్నారా?

- Advertisement -

ఇది పండుగ సీజన్‌. ప్రయాణాల గురించి చెప్పక్కర్లేదు. అయితే కొందరికి ప్రయాణం పడదు. బస్సు, లేదా కారులో ప్రయాణం అంటేనే భయపడతారు. కారణం వాంతులు. తలనొప్పి. ప్రయాణంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం, తేలికపాటి భోజనం తినడం ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వేయించిన ఆహారాలు: ఈ ఆహారాలు జీర్ణం కావడం కష్టం. వికారం సమస్యను పెంచుతుంది. బర్గర్లు, ఫ్రైలు, వేయించిన చిరుతిళ్లు ఎక్కువసేపు కడుపులో ఉండి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేయడానికి ప్రయాణానికి ముందు, తర్వాత తేలికపాటి, నూనె లేని భోజనం తినాలి.

మసాలా ఆహారాలు: స్పైసీ ఫుడ్‌ కడుపులో యాసిడ్‌ ఉత్పత్తిని పెంచుతుంది. వికారం, మైకం లక్షణాలను పెంచుతుంది. దీన్ని నివారించడానికి, మీ ప్రయాణానికి ముందు గ్రేవీ, మిరపకాయ, వేడి సాస్‌ల వంటి మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి.

పాల ఉత్పత్తులు: పాలు, చీజ్‌, క్రీముతో కూడిన ఆహారాలు ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో సేవిస్తే కడుపులో ఇబ్బంది కలిగిస్తాయి.

సిట్రస్‌ పండ్లు: ఆరెంజ్‌, నిమ్మ, ద్రాక్షపండు రసాలు ఆమ్లంగా ఉంటాయి. కడుపుని కలవరపరుస్తాయి. ఇవి హెల్తీ ఫుడ్స్‌ అయినప్పటికీ వీటిలోని అసిడిటీ వల్ల వికారం మరింత పెరుగుతుంది.

షుగర్‌ ఫుడ్స్‌: మిఠాయిలు, కేకులు, పంచదార చిరుతిళ్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ప్రయాణంలో గింజలు లేదా తణధాన్యాలు వంటి తక్కువ చక్కెర స్నాక్స్‌ ఎంచుకోవాలి.

రెడ్‌ మీట్‌: రెడ్‌ మీట్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రయాణానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల వికారం వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -