సింగిల్ చార్జింగ్‌తో 172 కిలోమీటర్లు
నవతెలంగాణ- హైదరాబాద్
విద్యుత్ బైకుల తయారీ కంపెనీ మాటర్ తమ ఆరేండ్ల శ్రమ తర్వాత తొలి బైకు ‘ఎరా’ను విడుదల చేసింది. నాలుగు గేర్లు కలిగిన ఈ బైకు సింగిల్ చార్జింగ్‌తో 172 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లో మాటర్ ఫౌండర్, సీటీఓ కుమార్ ప్రసాద్ తెలికెపల్లి ఎరాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ద్విచక్ర వాహన విభాగంలో 65 శాతం మోటార్ సైకిళ్లు వాటా కలిగి ఉన్నారని.. దేశంలో కేవలం 49 శాతం మంది మాత్రమే వాహనాలను కలిగి ఉన్నారని.. ఈ రంగంలో విస్తృత అవకాశాలున్నాయన్నారు.
అందులోనూ విద్యుత్ ద్విచక్ర వాహనాలకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. తమ ఎరా బైక్‌తో కేవలం 25 పైసలతో ఒక్క కిలోమీటర్ ప్రయాణించవచ్చన్నారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మంలో షోరూంలను తెరిచామని.. ఆంధ్రప్రదేశ్‌లోనే త్వరలోనే విస్తరించనున్నామని చెప్పారు. దేశంలో 15 డీలర్‌షిప్‌లను కలిగి ఉన్నామని చెప్పారు. త్వరలోనే వీటిని మూడంకెల స్థాయికి చేర్చనున్నామని తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే రూ.1790 కోట్ల నిధులను సమీకరించిందని.. వచ్చే ఏడాది మరో 200 మిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మాటర్ నుంచి’ఎరా’ ఇవి బైకు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES