Wednesday, September 24, 2025
E-PAPER
Homeకరీంనగర్టీఎస్ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ముచ్ఛకుర్తి శ్రీనివాస్

టీఎస్ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ముచ్ఛకుర్తి శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి 
తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం రామగిరి మండల అధ్యక్షునిగా కల్వచర్ల మాజీ ఉపసర్పంచ్ ముచ్ఛకుర్తి శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్ తో కలిసి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ నియామక పత్రాన్ని శ్రీనివాస్ కు అందజేశారు. తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని, జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. రామగిరి మండలంలో బీసీ కులాలన్నిటిని సంఘటితం చేసి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ముచ్ఛకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, నన్ను బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షునిగా నియమించిన జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ కు, నా నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రామగిరి మండలంలో బీసీల ఐక్యత కోసం, తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం పటిష్టత కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు గుండోజు ప్రవీణ్ కుమార్,దండే సదానందంలు పాల్గొన్నారు. ముచ్ఛకుర్తి శ్రీనివాస్ నియామకం పట్ల కల్వచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -