Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్ఎంపీ వైద్యం పేరిట ఆస్పత్రులను కొనసాగిస్తే కఠిన చర్యలు

ఆర్ఎంపీ వైద్యం పేరిట ఆస్పత్రులను కొనసాగిస్తే కఠిన చర్యలు

- Advertisement -

డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్
నవతెలంగాణ – కాటారం

కాటారం మండల కేంద్రంలో డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ ప్రైవేట్ ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు. సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్, అరవింద ప్రధమ చికిత్స కేంద్రం, లలిత క్లినిక్ తనిఖీలు చేశారు. జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా ఆసుపత్రిలో నడిపించవద్దని హెచ్చరించారు. ఆర్ఎంపి వైద్యం పేరిట ఆస్పత్రులను కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు.

 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్, నోటీసులు జారీ చేశారు. తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగినది. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఎంపీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అన్నారు.

 అన్ని రకములైనటువంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడైనా చేసినట్లు సమాచారము తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. అనుమతి లేకుండా అబార్షన్లు చేయరాదు అని తెలియజేశారు. తప్పకుండా అన్ని ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే వైద్యం అందించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుని ఆసుపత్రిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్ శ్రీదేవి, ఏం ఓ  డాక్టర్ మౌనిక, పిఓ డాక్టర్ సందీప్, డెమో శ్రీదేవి, డి డి ఎం మధు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -