గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్
ఇబ్బందుల్లో ప్రయాణికులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం ఇసుక క్వారీలోకి వస్తున్న లారీలకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో తాడిచెర్ల కొయ్యుర్ ప్రధాన రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో ప్రయాణికుల ఇబ్బందులకు గురైయ్యారు. మల్లారం బ్రిడ్జి నుంచి నాగులమ్మ వరకు నాలుగైదు కిలోమీటర్ల మేర ఇసుక,బొగ్గు లారీలతో ట్రాపిక్ జమ కావడంతో ఇబ్బందులు ఎదురైయ్యాయి. ఇసుక లారీలకు పార్కింగ్ ప్లేస్ లేక రోడ్డు, రైతులు పొలాలకు వేళ్ళు దారులపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న టిఎండిసి అదికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీని వెంటనే మూసివేయాలని పలువురు కోరుతున్నారు.
ఇసుక లారీలకు ప్రధాన రోడ్డే పార్కింగ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES