Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి 

యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అక్టోబర్ నెల 25, 26, 27 తేదీలలో జరగబోయే యుఎస్ ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 26,27, 28 తేదీలో నిర్వహించాల్సిన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధమ మహాసభలను వాయిదా వేయడానికి గల కారణం అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి యుఎస్ఎఫ్ఐ నాయకత్వం ప్రజల్లోకి వెళ్లి సర్వే చేయడమే అన్నారు.

శిధిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించడం లాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం, వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసించే కొరకు జరిగే కౌన్సెలింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం చేసిన జాప్యం వలన మహాసభలను వచ్చే నెల అనగా అక్టోబర్ 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థి లోకాన్ని మేధావులను విద్యావంతులను కోరడం జరుగుతుందని తెలియజేశారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, అలాగే వివిధ సెట్ ల కౌన్సిలింగ్ లను ఆలస్యం చేస్తూ విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంలో పడవేస్తుందని అన్నారు. అలాగే శిథిల వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు పక్క భవనాలను నిర్మించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్ట్ అని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర స్పందించి ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని లేనియెడల యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల వేదికగా రాష్ట్ర యొక్క ఉద్యమాలను రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. యుఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు పెద్ది సూరి, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, జిల్లా కమిటీ సభ్యులు వేణు, అభిషేక్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -