Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాలిటెక్నిక్ లో బతుకమ్మ సంబరాలు

ప్రభుత్వ పాలిటెక్నిక్ లో బతుకమ్మ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారంలో గల ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో బుధవారం రోజున దసరా, బతుకమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా ముందస్తుగా దుర్గా మాతను సేవించి అనాధిగా వస్తున్న ఆచారంలో భాగంగా కళాశాలలోని మెకానికల్, ఇసియి, ఇంజనీరింగ్ ల్యాబరెటరీలలో దుర్గా మాతను పూజించి ఆయుధపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులు, విద్యార్థినిలు బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహించారు. విద్యార్థినిలు, మహిళా ఉద్యోగుల ఆట, పాటలతో కళాశాలలో ఆధ్యాత్మిక శోభతో కళాశాల వాతావరణంతో వెలిగిపోయింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ కుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -