- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’. సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్‌లు ప్రదర్శించడంతో పాటు, టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -