నవతెలంగాణ – చిన్నకోడూరు
నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చిన్నకోడూరు మండల కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి ఏర్వ సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని శంకరయ్య కుంట గ్రామానికి చెందిన మాకు నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం విషయం తెలుసుకొన్న సత్యనారాయణ తో పాటు ఓబీసీ సెల్ మండల అద్యక్షుడు బంక చిరంజీవితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడుతూ అన్ని విధాల అండగా ఉంటూ ఆదుకుంటామని భరోసా ఇచ్చి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. మీ కుటుంబానికి మా సహకారం ఎల్లవేళలా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గుద్ధ రాజేందర్ కరుణాకర్ యాదగిరి పోచమల్లు ఎల్లం దేవయ్య కనకరాజు నరసయ్య మల్లేశం కనకయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES