నవతెలంగాణ – ఆర్మూర్
ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామంలో బుధవారం దుర్గామాత దేవి కి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ ఆర్.ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, గ్రామ మాజీ సర్పంచ్ ఆశాపురం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామంలో దుబ్బ మీద ఏర్పాటు చేసిన దుర్గాదేవి మాత మండపాన్ని సందర్శించి, కొబ్బరి కాయ కొట్టి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవి మండపం దగ్గర అన్న ప్రసాదంలో సేవలు అందిస్తున్న మహిళలతో మాట్లాడుతూ ఆ దుర్గా మాతకు సేవా కార్యక్రమాలు చేసి నందుకు ధన్యవాదాలు, మాత కరుణ కటాక్షం మీ పై ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మాతను కోరినారు. ఈ కార్యక్రమంలో భీమయ్య, ప్రసాద్, సర్దార్, శ్రీవాస్ రెడ్డి, గ్రామ మహిళలు గ్రామ స్వాములు, యూత్ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పిప్రీ గ్రామంలో దుర్గ మాత ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES