రైతు వొర్రెల రంగయ్యకు ఘన సన్మానం..
నవతెలంగాణ – చిన్నకోడూరు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన వొర్రెల రంగయ్య కు ఆదర్శ ఉత్తమ రైతుగా ఎంపికైన సందర్భంగా శాలువా మెమొంటోతో సన్మానం చేశారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డి ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఆదర్శ ఉత్తమ రైతులను ఎంపిక చేసి ఘన సన్మానం చేసినట్లు రైతు రంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉత్తమ రైతుగా ఎంపిక చేసి సన్మానించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సర్పంచ్ సూరగొనిచంద్రకళ రవిగౌడ్ మాట్లాడుతూ.. మా గ్రామ రైతు ఆదర్శ ఉత్తమ రైతుగా ఎంపిక కావడం ఎంతో అభినందనీయమన్నారు. సిద్దిపేట లైన్స్ క్లబ్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్, సిద్దిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు వినోద్ కుమార్ మోదని, సెక్రటరీ వీరభత్తిని సత్యనారాయణ కోశాధికారి చీకోటి చంద్రశేఖర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఆదర్శ రైతుగా చంద్లాపూర్ వాసి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES