Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ వర్కర్లకు బకాయిల వేతనాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి..

హాస్టల్ వర్కర్లకు బకాయిల వేతనాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
తెలంగాణ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన హాస్టల్ లో పనిచేస్తున్న డైలీ వేస్ వర్కర్లకు బకాయిలు ఉన్న వేతనాలు ఇవ్వాలని బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వ్యవసా కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ మల్లేష్, ఆశ్రమ పాఠశాల యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ మాట్లాడారు. గత 13 రోజులుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వర్కర్ల 7 నెలల జీతాలు చెల్లించాలని, టైం స్కేల్ జీతాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పది డిమాండ్ల మీద సమ్మె చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వము వీరి డిమాండ్లపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2010లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేస్ వర్కర్లకు పర్మినెంట్ చేయాలని ఒక తీర్మానం చేసినారు. ఆ తీర్మానాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. వీళ్లకు పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా  ప్రభుత్వము విళ్లను గుర్తించలేదన్నారు. దినిని గూర్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని వారు ఎమ్మెల్యేను కోరారు.

లేనియెడల పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్,   ఆశ్రమ పాఠశాల వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు పద్మ, ఎల్లమ్మ, బాలమణి, గౌరమ్మ, నీల, రాజు, ఓం ప్రకాష్, నరసింహ, సుధాకర్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -