Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళాశాలలో బతుకమ్మ పండుగ..

కళాశాలలో బతుకమ్మ పండుగ..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులు తీరొక్క పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను పూలతో పెరించి, ఆట పాటలతో బతుకమ్మ పండుగ సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా విచ్చేసిన కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో ఆడ బిడ్డల ప్రధాన పండుగ అని అన్నారు. ఇది ప్రతి ఇంటిలోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అంతటా జరుపుకునే ఆడపడుచుల పండగ అన్నారు. దీనిని మనమందరం ఘనంగా జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక నిలువుటద్దం, దీన్ని ప్రతి సంవత్సరం మన కళాశాలలో ఇంకా ఘనంగా నిర్వహించుకుందామని కళాశాల ప్రిన్సిపల్  సింగం శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -