Wednesday, September 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం..

మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, మహిళా ఆరోగ్యమే కుటుంబం ఆరోగ్యమని మండల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉమాశ్రీ అన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వైద్య శిబిరం డాక్టర్ ప్రసాద్ ఎన్ సి డి ప్రోగ్రామ్ అధికారి మంచిర్యాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శ్రావ్య (స్త్రీ వైద్య నిపుణులు)డాక్టర్ ప్రీతి (పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారన్నారు. జన్నారం మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు , చిన్నపిల్లల కు పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇక ముందు నిర్వహించే వైద్య శిబిరాలను మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి హెల్త్ సూపర్వైజర్లు MLHP లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -