నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం , గోడౌన్ ఐడిసిఎంఎస్ అంక్సాపూర్ శాఖలను బుధవారం తనిఖీ చేసి ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇప్పటి వరకు వానాకాలం 2025-26 సీజన్ కి గాను 2985.03 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు యూరియా మోతాదు కి మించి వాడకూడదని ఆయన తెలిపారు. దాని వల్ల వాతావరణం కలుషితం కావడమే కాకుండా.. పంటపై పురుగుల తాకిడి ఎక్కువవుతుందని, సాగు ఖర్చు పెరిగిపోతుందని అన్నారు.
రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్ల యూరియా కృత్రిమ ఏర్పడే అవకాశం ఉంటుందని కావున రైతులు ఆందోళన పడకుండ అవసరం మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. సాంప్రదాయ యూరియా కి బదులుగా నానో యూరియా వాడటం అలవాటు చేసుకోవాలని, నానో యూరియా ద్రవ రూప ఎరువు కావడం వల్ల, సరాసరి ఆకులపై పిచికారి చేయడం వలన మొక్కలలో శోషణ ఎక్కువగా జరిగి దిగుబడి 8 శాతం వరకు పెరుగుతుంది అని అన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి శృతి, సొసైటీ సెక్రటరీ కృష్ణ, సేల్స్మెన్ సతీష్ ,సుభాష్ , తదితరులు ఉన్నారు.