నవతెలంగాణ- కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల చివరి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థులు బోయిండల శ్రీ సూర్య, శశాంత్ కుమార్ జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు అని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 20 సెప్టెంబర్ 2025న సూరత్‌లో నిర్వహించిన ఎమ్ ఐ డి -డి ఈ ఆర్ ఎం ఏ సి ఓ ఎన్ 2025 లో జరిగిన ఐఏడిఈఎల్ యుజి డెర్మటాలజీ క్విజ్ లో వీరు రెండవ స్థానం సాధించారు. ఈ క్విజ్‌కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో నిర్వహించగా, దేశవ్యాప్తంగా 100కిపైగా బృందాలు పాల్గొన్నాయి. వాటిలోంచి 5 బృందాలు మాత్రమే జాతీయ ఫైనల్స్‌కి ఎంపికయ్యాయి. అందులో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనబరచి రెండో స్థానం దక్కించుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ కనబరిచిన సర్టిఫికెట్లను అందజేశారు.
జాతీయస్థాయిలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ప్రతిభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES