Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సంఘాల పుస్తక నిర్వహణపై శిక్షణ..

గ్రామ సంఘాల పుస్తక నిర్వహణపై శిక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివ్ నగర్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో  బుధవారం స్థానిక రైతు వేదికలో  వివో ఏలకు పుస్తక నిర్వాణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షురాలు బాలం బాయ్ అధ్యక్షతన  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఎం జి రామచందర్ గ్రామ సంఘంలో ఎలాంటి పుస్తకాలు నిర్వహించాలి సమావేశాల నిర్వహణపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా తీర్మానం పుస్తకము నగదు పుస్తకము బ్యాంకు ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించాలని వివో ఏ లకు సూచించారు. గ్రామ సంఘం రికార్డులను  పగడ్బందీగా భద్రపరచాలని వివోఏలను కోరారు.

ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షురాలు బలం భాయ్ మాట్లాడుతూ.. గ్రామ సంఘాల సమావేశాలు గ్రామస్థాయిలో సక్రంగా నిర్వహించి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని  ఉద్దేశించి ఏపీఎం  ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో బ్యాంకు నుండి / గ్రామ సంఘాల నుండి. చిన్న సంఘాల నుండి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలని, బ్యాంకు లింకేజీ  నిర్దేశించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని, వివో ఏ లను  కోరారు. ఈ కార్యక్రమంలో సీసీలు అంజా గౌడ్ , ప్రతాప్, భూమయ్య ,ఆంజనేయులు  నరేందర్ రెడ్డి ,రాజు ,అకౌంటెంట్ రమేష్ గ్రామ సంఘాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -