నవతెలంగాణ – దుబ్బాక
మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీయోద్దీన్ అన్నారు. పలు అభివృద్ధి పనుల నిమిత్తం మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెక్సీ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ అప్పుల్ని కడుతూనే అటు సంక్షేమం ఇటు అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు.
అందులో భాగంగానే దుబ్బాక మున్సిపాలిటీకి రూ.15 కోట్ల ను మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆస శరభయ్య, మహమ్మద్ సలీం, యాదగిరి గౌడ్, ధాత్రిక విజయ్ కుమార్, వసీం, స్వామి, నవీన్, అష్రఫ్ పలువురున్నారు.
మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం: రఫీయోద్దీన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES