వెయ్యి విద్యాలయాలను తెరవండి… గుడులతో సామాజిక వివక్షతే కొనసాగుతుంది
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెయ్యి దేవాలయాల నిర్ణయం కంటే విద్యాలయాలు, హాస్పిటల్ నిర్మించేందుకు కృషి చేయాలని అప్పుడే సమాజం ఎదుర్కొంటున్న రుగ్మతలను రూపుమాపడానికి దోహద పడుతుందని అన్నారు. కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే విధానాలపై పోరాడాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో కెవిపిఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రెండో మహాసభలు ప్రారంభించి మాట్లాడారు.
ఈ మహాసభలకు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు అధ్యక్షత జరిగింది. సందర్భంగా స్కై లాబ్ బాబు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ హిందుత్వ నియంతృత్వ ఎజెండా అమలును కార్మిక, కర్షక, సామాజిక శక్తులతో అడ్డుకుంటామని తెలిపారు సనాతన ధర్మం ముసుగులో మనువాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి హిందుత్వ శక్తులు పథకం ప్రకారం ముందుకు తీసుకొస్తుందని అన్నారు. ఈ విధానాన్ని సామాజిక శక్తులు అడ్డుకోవాలని అన్నారు. బిజెపి తన రాజ్యాంగ వ్యతిరేక స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానిస్తూ చేసిన వాక్యాలు దేశం మరువదని అన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమిచాలని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఆహార సబ్సిడీకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి పూర్తిస్థాయిలో నీదులకోత విధించి అట్టడుగు వర్గాలకు ద్రోహం చేసిందని విమర్శించారు. బిజెపి విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి కెవిపిఎస్ సామాజిక శక్తులను కలుపుకొని పోరాడుతుందని తెలిపారు.బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాలలో కుల వివక్ష అంటరానితనం కొనసాగితే సహించేది లేదన్నారు .పండగలు ఉత్సవాలన్నీ ప్రజలు సమైక్యంగా జరుపుకోవాలని చెప్పారు సామాజిక మాధ్యమాలలో మహనీయుల లక్ష్యాలు ఆశయాలను కుల నిర్మూలన లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేష్ మాట్లాడుతూ.. కెవిపిఎస్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం , జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయించి అంటరానితనం కుల వివక్షత నిర్మూల కోసం నిర్విరమమైనా పోరాటం చేసిందని తెలిపారు, కులంతా వివాహాల జంటల పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రావాల్సిన పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. తక్షణమే అట్రాసిటీ బాధితులకు రావాల్సిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి మల్లరపు అరుణ్, ఐద్వా జిల్లా కార్యదర్శి విమల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, గన్నేరువారపు నరసయ్య, నాయకులు రమేష్ చంద్ర, పద్మ, ప్రతాప్ కుమార్ ,ప్రశాంత్, నరేంద్ర, సుధీర్,బాలరాజ్, ప్రసాద్, రూత్విక్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES