నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించడం జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో విద్యార్థిని విద్యార్థులతో అధ్యాపక బృందం సహకారంతో క్లాసికల్,ఫోక్ సాంగ్స్ తో నృత్యాలు చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులలో ఉన్నటువంటి కలలను బయటకు తీయడానికి “ఫెస్ట్ టు బెస్ట్”, “పెయింటింగ్” మొదలైనవి కార్యక్రమాలను విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాలచైర్మన్ మాట్లాడుతూ.. నేతాజీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అని కోరారు.
అనంతరం ఈవెంట్స్ లలో అద్భుతమైనటువంటి కలలు ప్రదర్శించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలుఇవ్వడం జరిగింది. అదేవిధంగా అద్భుతమైనటువంటి కల్చరల్ ఆక్టివిటీస్ తో విద్యార్థిని విద్యార్థులు సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం అధ్యాపక బృందాన్ని కళాశాల యాజమాన్యం శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించడం జరిగింది. యాజమాన్యాన్ని కూడా అధ్యాపక బృందం శాలువా మరియు జ్ఞాపకతో సన్మానం చేయడం జరిగింది.ఈ ఉత్సవాల్లో నేతాజీ డిగ్రీ కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీధరావు, డైరెక్టర్ జూపల్లి పద్మాదేవి, కరాస్పాండెంట్ నాయిని జగన్ మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నరు.
నేతాజీ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఉత్సవాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES