నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తమ గ్రామాలు పరిసర ప్రాంతాలనుండి తీసుకు వచ్చిన తీరొక్క రంగు రంగుల పువ్వులను తీసుకువచ్చి బతుకమ్మను అలంకరించారు. తొమ్మిది రోజులు ఆడే బతుకమ్మ ఆటలో ఒక్కొక్క రోజు పిలిచే బతుకమ్మల ప్రత్యేక పేర్లను విద్యార్థులు బతుకమ్మలను చూపిస్తు ఆ రోజుల్లో చేసే అలంకరణ ప్రసాదాల గురించి తెలియచేశారు..ఈ సందర్బంగా కాలేజ్ ప్రిన్సిపాల్ వెముల గణేష్ మాట్లాడాతు ప్రపంచంలో పువ్వులతో దేవుళ్ళని పూజిస్తే పూలనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి విశిష్టత ఒక తెలంగాణ లో మాత్రమే ఉంటుందన్నారు. ఈ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులు తెలుసుకుంటూ బావితరాలకు అందజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకబృందం రాజేంద్రప్రసాద్, సమత, మానుష, సుప్రియ ,మాధురి, అరుణ తధితరులు పాల్గొన్నారు.
అపోలో వొకేషనల్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES