ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు నందు ఈనెల 26 న మెగా పేరెంట్స్ _టీచర్ ప్రోగ్రాం నిర్వహణ ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగకుటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన లో బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క విద్యా ప్రగతి, హాజరు శాతం, పరీక్షా ఫలితాల వివరాలు, విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యం, మరియు వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులను ఎలా సన్నద్ధం చేయాలి వంటి వివిధ అంశాలను నేరుగా తల్లిదండ్రుల అధ్యాపకులతో చర్చించాలని తెలియజేశారు, దీని ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతి తో, పాటు ఉత్తమ ఫలితాలు సాధించగలరని ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 26న మెగా పేరెంట్స్ మీటింగ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES