Thursday, September 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సమైక్య యంత్రాలు, పనిముట్లు ఎక్కడ..?

సమైక్య యంత్రాలు, పనిముట్లు ఎక్కడ..?

- Advertisement -

3 సంవత్సరాలుగా కానరాని యంత్రాలు, పనిముట్లు
ఇతర మండలంలో అద్దెకు ఇచ్చినట్లు డ్యాక్యుమెంట్స్
నవతెలంగాణ – కుభీర్
గత ప్రభుత్వం 2021 సంవత్సరం లో మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళా రైతులకు తక్కువ ఖర్చుతో సకాలంలో వ్యవసాయ పనులు నిర్వహించుకునేందుకు గాను ఎన్ఆర్ఎల్ ఎం కింద మండలానికి రూ. 29 లక్షలతో ఒక అర్వెస్టర్, ట్రాక్టర్, రూటావేటర్, ట్రాలీ, సీడ్ ఢిల్లర్, ప్లావు, పనిముట్లను కొనుగోళ్లు చేసి కుభీర్ మండల సమైక్య కు అందించడం జరిగింది. అందించిన యంత్రాలు పనిముట్లు కుబీర్ మండల డ్వాక్రా మహిళా రైతంగానికి ఉపయోగపడడం లేదు. ఇతర మండలంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. మండల రైతులకు ఉపయోగం లేకుండా ఇతర మండలాలకు యంత్రాలను అద్దెకిచ్చి ఇక్కడి రైతులకు గతంలో పనిచేసిన ఏపీఎం రమేష్ పనితీరుపై మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అద్దెకు ఇచ్చిన అర్వెస్టర్ గడువు ముగిసి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఆ  పనిముట్లు, యంత్రాలు కానరాకుండా పోయాయి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల రైతులకు ఉపయోగపడే చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -