Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర మంత్రి డా. పెమ్మసానిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

కేంద్ర మంత్రి డా. పెమ్మసానిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు టెలికాం రంగంలో శిక్షణా కార్యక్రమాలు చేపట్టి ఉపాధి అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, జుక్కల్ నియోజకవర్గాన్ని స్వయంగా సందర్శించి, ప్రాథమిక స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించాలని గౌరవమంత్రి గారినిఆహ్వానించారు.

ఈ అంశాలపై స్పందించిన మంత్రి  సానుకూలంగా స్పందించడంతో పాటుపూర్తిసహకారంఅందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక, జుక్కల్ నియోజకవర్గానికి 3 బిఎస్ఎన్ఎల్ టవర్స్‌ను మంజూరు చేస్తానని ప్రకటించారు. ఇది జిల్లాలో టెలికాం కనెక్టివిటీ మెరుగుపరచడంలో కీలకంగా నిలవనుంది.జుక్కల్ అభివృద్ధికి తన యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ భేటీలో ఎన్ ఆర్ ఐ  ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు  బుజంగారి భాస్కర్ రెడ్డి  కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -