నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న “స్నేహ” కార్యక్రమంపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అవగాహన – సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా 15–18 ఏళ్ల వయసు గల యువతీ యువకులకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారిని విద్య కొనసాగింపు, ఉపాధి నైపుణ్యాలు, ఆర్థిక స్వావలంబన వైపు దారితీసే చర్యలు చేపడతారనీ తెలిపారు.
జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పలు విభాగాలు-డీ.ఆర్.డి.ఓ, మహిళా-శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పోలీస్, పంచాయతీ రాజ్, కార్మిక, నైపుణ్యాభివృద్ధి తదితర విభాగాలు కలసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయనీ, స్నేహా సంఘాల ద్వారా గ్రామ స్థాయిలో యువతీ యువకులకు సమాజంలో భద్రత, హెల్త్ & న్యూట్రిషన్, బాల్యవివాహాల నివారణ, మానసిక-సామాజిక సమస్యలు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాలపై క్రమం తప్పని శిక్షణలు, చర్చలు జరుగుతాయి.
జిల్లాలోని ప్రతి గ్రామంలో కనీసం ఐదు నుండి 15 మంది సభ్యులతో స్నేహా సంఘాలు ఏర్పాటు చేసి, నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందనారు. అనంతరం అదనపు డిసిపి లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. ప్రతి గ్రామములో ఒక పోలీసు ఇట్టి కార్యక్రమములపై చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ సమావేశములో జిల్లా సంక్షెమ అధికారి నరసింహ రావు , జిల్లా యస్ సి సంక్షెమ అధికారి శ్యాం సుందర్ , జిల్లా ఉపాధి కల్పనా అధికారి సాహితి, జిల్లా ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అధికారి రమణి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మనోహర్ , జిల్లా యువజన సంక్షెమ అధికారి శ్రీదానంజనేయులు, మెప్మ ఫైడి రమేష్ , అదనపు డిఆర్.డిఓ కొత్త జంగారెడ్డి , జిల్లా ప్రాజెక్ట్ మేజర్ ప్రభాకర్ , అదనపు ప్రాజెక్ట్ మేనేజర్లు సేర్ప్ పాల్గొన్నారు.
స్నేహ కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES