లాయర్స్ పోరం అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి..
నవతెలంగాణ – భువనగిరి
న్యాయవాదుల రక్షణ చట్టాలపై బార్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేస్తామని లాయర్స్ ఫోరం అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి తెలిపారు. బుధవారం ఆయన భువనగిరిలో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన న్యాయవాదిగా లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ అఖిల భారతీయ న్యాయవాద ఆదిభక్త మంచిల సంస్థల నుంచి న్యాయవాదులకు రక్షణ చట్టాలు చేయాలని, జూనియర్లకు రూపాయలు ఐదువేలు ఉపకార వేతనాలు ఇవ్వాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయవాద సంఘాలు న్యాయవాదుల మద్దతుతో పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా న్యాయవాదులకు రక్షణ చట్టాల ఏర్పాటు చేయాలని ఏకైక లక్ష్యంతో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ప్రతి న్యాయవాది 25 ఓట్లు వేసే అవకాశం ఉంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తానని నర్రి స్వామి తెలిపారు.