నవతెలంగాణ – భువనగిరి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్లో మహిళా వికలాంగుల బతుకమ్మ పాట బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత మాట్లాడుతూ.. అన్ని సక్రమంగా ఉన్న మహిళలు పండుగ జరుపుకుంటే వికలాంగుల మహిళలు వేదన గురవుతున్నారని తెలిపారు. అందుకనే ప్రభుత్వాలు వికలాంగుల మహిళల గురించి వాళ్లకు అన్నిట్లో సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలని కోరారు. ఎన్ పి ఆర్ డి మహిళా రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జిల్లా కేంద్రాలలో మహిళా వికలాంగుల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటపాట నిర్వహించి వారిలో ఉత్సాహం నింపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్డీ జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండాపురం మనోహర, ఎన్ పి ఆర్ డి జిల్లా కోకన్వీనర్ బర్ల పార్వతి, మహిళా జిల్లా నాయకురాలు సరిత, జిల్లా మహిళా నాయకురాలు కల్లూరు నాగమణి, మాయా రాణి, సునీత గోపి పాల్గొన్నారు.