నవతెలంగాణ – కంఠేశ్వర్
స్థానిక సమస్యలపై సర్వేలో భాగంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలో నాయకులు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. గత 17 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే విరివిగా హామీలిస్తారని, కానీ ఎన్నికలు ముగిసాక వాటిని మర్చిపోతారని అన్నారు. పేద ప్రజలను మభ్య పెడుతూ.. ఇండ్లు నిర్మిస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆచరణ పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధికారులు, నాయకులు మారుతున్నారే తప్ప వారి సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆమె ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్థానిక సుందరయ్య కాలనీ సమస్యలను పరిష్కరించకపోతే రేపు రానున్న రోజుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు హైమద్, భీమశంకర్, జలేక నరసమ్మ, రహిమ, వరలక్ష్మి, గంగాధర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య కాలనీలో పర్యటించిన సీపీఐ(ఎం) నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES