– 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం
– హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లో గంజాయి తాగుతూ, విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హుస్నాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బుధవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాస్, ఎస్ ఐ లక్ష్మారెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం వివరాలను వెల్లడించారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన చుక్క అనిల్ ,బూర్ల రాకేష్, మదన అభినయ్ హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డులో గంజాయి సేవిస్తూ ఇతరులకు విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బందితో కలిసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు.
పరారీలో ఉన్న వంశీ వద్ద కొనుగోలు చేసిన 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నాలుగో వ్యక్తి వంశీ కోసం గలిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో మరియు హోటళ్లల్లో కళ్ళు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లుగానే కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. లేదంటే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు లేదా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447, లకు సమాచారం అందించాలని సూచించారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారు వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గంజాయి కలిగి ఉన్న మరియు విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.