రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. విఎస్‌వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వి.వి.వినాయక్, సెకండ్ సాంగ్‌ను ఆర్‌పి.పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా హీరో అల్లరి నరేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘మా ‘విద్రోహి’ మూవీకి హీరో శ్రీకాంత్, దర్శకుడు వివి వినాయక్, సంగీత దర్శకుడు ఆర్‌పి.పట్నాయక్ మాకు సపోర్ట్ చేశారు. ఇండిస్టీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’ అని నిర్మాత వెంకట సుబ్రమణ్యం తెలిపారు. దర్శకుడు విఎస్‌వి మాట్లాడుతూ,’ ఫస్ట్ లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ చాలా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. సెకండ్ సాంగ్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో ఉండే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.’ అని చెప్పారు.
సరికొత్త పాయింట్‌తో ‘విద్రోహి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES