Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం

సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం

- Advertisement -

కవి సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ-కల్చరల్‌
సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహణలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతీలో ఏర్పాటుచేసిన కవి సమ్మేళనాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారు లు, సాహితీవేత్తల పాత్ర అమోఘమని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు.
తెలుగు సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉందని, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ నుంచి కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ తర్వాత దాశరథి, కాళోజీ లాంటి వారి రచనలు ప్రజలను చైతన్యం, జాగృత పరిచాయని గుర్తు చేశారు.

ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు కవులు, పండితులు, రచయితల ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయ న్నారు. సామాజిక రుగ్మతలు, యువతలో పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను రేపటి పౌరులుగా గురువులు తీర్చిదిద్దినట్టు, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని చెప్పారు. తెలంగాణ సమాజంలో సామా జిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారు లపై ఉందన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మీరిచ్చే సలహాలు సూచనలను స్వీకరిస్తామని మంత్రి అన్నారు. ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పుస్తకాలను గ్రామగ్రామాన చేరవేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకు లు డాక్టర్‌ ఏనుగు నరసింహా రెడ్డి స్వాగతం పలికారు. వేదికపై నెల్లుట్ల రమాదేవి, ఇతర కవులు, రచయితలు సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -