నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్‌షో, టిక్కెట్ రేట్ల పెంపునకు హౌం శాఖ ఇచ్చిన మెమో అమలును హైకోర్టు నిలిపివేసింది. హౌంశాఖ కార్యదర్శి జారీ చేసిన మెమో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌కు వ్యతిరేకమంటూ దాఖలైన పిటిషనల్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 24న బెనిఫిట్ షో టిక్కెట్ రూ.800 ధర నిర్ణయించింది. పెంచిన టిక్కెట్ ధరలను అక్టోబర్ 4వరకు అమల్లో ఉండేలా అనుమతిచ్చింది. బి.మల్లేశ్ యాదవ్ సవాల్ చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ బుధవారం విచారించారు. 2021లో ఇచ్చిన జీవో 120కి విరుద్ధంగా మెమో ఉందన్న వాదనను ఆమోదించారు. బెనిఫిట్ షో టిక్కెట్ రేట్ల పెంపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ అయినందున 18 ఏండ్లు నిండిన వారికే సినిమా చూసేందుకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. కౌంటర్లు దాఖలు చేయాలని హౌం శాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లకు నోటీసులు ఇచ్చారు. విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.
ఓజీ సినిమా టిక్కెట్ రేట్ల పెంపు నిలిపివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES