Thursday, September 25, 2025
E-PAPER
Homeఆటలుతడబడ్డ బ్యాటర్లు

తడబడ్డ బ్యాటర్లు

- Advertisement -

ఆధిక్యతలో ఆస్ట్రేలియా-ఎ

అహ్మదాబాద్‌: ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో ఇండియా-ఎ బ్యాటర్లు తడబడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా-ఎ 420 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం ఇండియా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 194పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా-ఎకు 226పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9వికెట్ల నష్టానికి 384పరుగులతో రెండోరోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా-ఎ చివరి వికెట్‌కు మరో 36పరుగులు జత చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-ఎకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ కెఎల్‌ రాహుల్‌(11) స్వల్ప స్కోర్‌కే పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జగదీశన్‌(38), సాయి సుదర్శన్‌(75) కలిసి 100పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఇండియా-ఎ బ్యాటర్లు వరుసగా పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఆయుశ్‌ బడోనీ(21), ప్రసిధ్‌ కృష్ణ(16) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశారు. దీంతో భారత ఇన్నింగ్స్‌ 52.5 ఓవర్లలో 194పరుగులకే పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాను సిరాజ్‌-హర్‌ప్రీత్‌ బ్రార్‌ కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 16పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా-ఎ జట్టు ఇప్పటికే 242పరుగుల ఆధిక్యతలో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -