Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : లైసెన్సు సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యం హనుమంత రావు  ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) ఒక అంశంగా ఉండి కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.  ఐటిఐ నుండి డ్రాఫ్ట్ మన్ (సివిల్), డిప్లమా సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలి.  శిక్షణ ఫీజు ఓసి అభ్యర్థులకు రూ. 10,000/- లు, బీసీ అభ్యర్థులకు రూ. 5,000/- లు, ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు రూ. 2,500/- చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రంలో మొత్తం 50 పనిదినాలలో తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.  మరిన్ని వివరాలకు జిల్లా సర్వే, రికార్డుల కార్యాలయం, కలెక్టరేట్, యదాద్రి భువనగిరి జిల్లా సెల్ నెంబర్లు  9177773713: 9640043847 లకు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad