Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రేమ వివాహం.. యువకుని ఇంటిపై దాడి

ప్రేమ వివాహం.. యువకుని ఇంటిపై దాడి

- Advertisement -

– యువతిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు
నవతెలంగాణ-కీసర

ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో యువతి తల్లిదండ్రులు బంధువులతో కలిసి యువకుడి ఇంటిపై దాడి చేసి.. వారిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధి నర్సంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్గం ప్రవీణ్‌, స్వేత ఒకే గ్రామానికి చెందినవారు. ఇద్దరూ దాదాపు మూడు నెలల ముందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు నగరంలో నివాసమున్నారు. నెల కిందటే స్వగ్రామంలోని ప్రవీణ్‌ ఇంటికి వచ్చారు. అయితే, బుధవారం స్వేత కుటుంబ సభ్యులు వచ్చి ప్రవీణ్‌, అతని తల్లిదండ్రుల కండ్లల్లో కారం కొట్టి, దాడి చేశారు. బలవంతంగా స్వేతను ఎత్తుకెళ్లారు. బాధితులు కీసర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని కీసర సీఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -