Thursday, September 25, 2025
E-PAPER
Homeక్రైమ్పండ్ల వ్యాపారి దారుణ హత్య

పండ్ల వ్యాపారి దారుణ హత్య

- Advertisement -

– రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో బుద్వేల్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సర్వీస్‌ రోడ్డుపై ఒక వ్యక్తి మృతదేహం ఉందని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద లభించిన ఆధార్‌ కార్డు ప్రకారం బండ్లగూడ ప్రాంతానికి చెందిన మినాజుద్దీన్‌గా గుర్తించారు. అతడు స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్టు గుర్తించారు. అయితే దుండగులు ఎక్కడో ఇతన్ని హత్య చేసి ఇక్కడ పడేసి వెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -