Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి

బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొంటున్న వివాహిత శెట్టి మౌనిక (32) గుండెపోటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను పరిస్థితి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -