నవతెలంగాణ- ఆర్మూర్
ఈనెల 13న నవతెలంగాణలో ప్రచూరితమైన పెట్రేగిపోతున్న వివక్ష వార్తకు స్పందన లభించింది. నియోజకవర్గంలోని నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో 15 సంవత్సరాల క్రితం మాజీ విఆర్ఓ, ఒకటి, రెండు రోడ్లు కలిసే స్థలాన్ని కబ్జా చేశారు. గ్రామంలోని ఆలయ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా రైస్ మిల్ నిర్మించి స్థలాన్ని కబ్జా చేసినాడు. పెత్తందారులదే ..హవా. అంటూ ప్రచురితమైన వార్తకు ఇటీవల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో, బుధవారం పట్టణ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మైపాల్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ తదితరులు కలిసి విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరినారు. సీలింగ్ భూమి కబ్జా గురించి అనుమతి లేకుండా కొనసాగుతున్న రైస్ మిల్ గురించి సబ్ కలెక్టర్కు వివరించారు. ఇంటి నంబరు తీసుకొని ఇండస్ట్రీకి చెందిన రైస్ మిల్ పెట్టి నిర్వహిస్తుండడం వల్ల ఎస్సీ, బీసీ కాలనీ వాసులకు దుమ్ముతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని సబ్ కలెక్టర్ కు వివరించినారు.
నవతెలంగాణ వార్తకు స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES