Thursday, September 25, 2025
E-PAPER
Homeజిల్లాలురైతు బిడ్డ డీఎస్పీగా ఎంపిక 

రైతు బిడ్డ డీఎస్పీగా ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు 
నిన్న రాత్రి  గ్రూప్ -1 ఫలితాలు విడుదలైన విషయం విదితమే. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన నరిగే స్వామి 95వ ర్యాంకు సాధించారు. గ్రామానికి చెందిన నరిగే కనకవ్వ-చంద్రయ్యలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టానికి తగినట్టుగా విద్యనభ్యసించాడు. చంద్రయ్యకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు స్వామిని కష్టపడి చదివించారు. స్వామి 95 ర్యాంకు సాధించి డీఎస్పీ గా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. గతంలో గ్రూప్-2 ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం పొందినప్పటికీ ఉద్యోగాన్ని వదిలి గ్రూప్ -1ఎగ్జామ్ వ్రాసి  ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడంతో కుటీంబీకులు ఆనందోత్సవంలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -