Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోపాల్ మండల కేంద్రంలో పశు వైద్య శిబిరం

మోపాల్ మండల కేంద్రంలో పశు వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ 
మోపాల్ మండల కేంద్రంలో గురువారం రోజున పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పశు వైద్యాధికారి రోహిత్ రెడ్డి మరియు మండల వైద్యాధికారి జి. శిరీష పాల్గొని పశువులకు  గర్భకోశ వ్యాధులు, నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అలాగే పష్ పోషణకు సంబంధించిన మెలుకువలను, పశువుల ఆరోగ్య పరిరక్షణ గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గేదెల పెంపకం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చు అని ప్రస్తుతం మార్కెట్లో పాల ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు సురేష్ ,మురారి ,జావేద్ గోపాల మిత్రులు రజనీకాంత్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -