Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో వైభవంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు 

జనగామలో వైభవంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు 

- Advertisement -

– ప్రతి సంవత్సరం జిల్లాలోనే ఘనంగా నవరాత్రి వేడుకలు 
– రాత్రి అయితే కోలాటాలు, దండి ఆటలతో సందడి 
– ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉత్సవాలు 
నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్ 

బతుకమ్మ దసరా పండుగ వచ్చిందంటే ఆ గ్రామంలో సందడి సందడిగా ఉంటుంది. ఆ గ్రామ నివాసి అయిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహస్తున్నారు. ఈ క్రమ్ంలో దుర్గామాత సెట్టింగ్ వేయించి, లక్షల ఖర్చు చేసి అత్యంత వైభవంగా కామారెడ్డి జిల్లాలోని ఏ గ్రామంలో జరగని విధంగా ఆ గ్రామంలో ఈ దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిగా కొనసాగిస్తున్నారు. 

దాండియా మాస్టర్ లతో గ్రామస్తులకు ఆటలు..
ప్రతిరోజు, రాత్రి ప్రత్యేకంగా దాండియాను గ్రామ ప్రజలకు నేర్పేందుకు ప్రత్యేకంగా మాస్టర్నులను పిలిపించి గ్రామస్తులతో దండి ఆటలు నేర్పిస్తూ.. ఆడిస్తూ ఉంటారు. 

30 నుండి 50 మందికి పైగా దీక్ష మాలాధారణ…
ప్రతి సంవత్సరమా గ్రామంలోని యువకులు 30 నుండి 50 మందికి పైగా నవరాత్రి ఉత్సవాలకు దీక్ష మాలదరణ చేస్తారు. అక్కడ ఉండే హనుమాన్ ఆలయంలోని వారికి ఉదయం సాయంత్రం అల్పాహారం, భోజనం ఏర్పాటు చేస్తారు. 

చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రాక.
ఆ గ్రామంలోని ప్రజలే కాకుండా గ్రామ చుట్టూ ఉన్న బిబిపేట్, మాందాపూర్, దోమకొండ, అంబర్పేట్, కామారెడ్డి తదితర గ్రామాల నుండి సైతం ఇక్కడ ఉత్సవాలను చూసేందుకు భక్తులు వస్తూ ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -