Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమాలే ఊపిరిగా సాగిన ఎస్కే లతీఫ్ జీవితం..

ఉద్యమాలే ఊపిరిగా సాగిన ఎస్కే లతీఫ్ జీవితం..

- Advertisement -

ఎండి.జహంగీర్ ఆవాజ్ రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ – భువనగిరి

ఉద్యమాలే ఊపిరిగా ఎస్.కె లతీఫ్ జీవితం కొనసాగిందని ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎండి జహంగీర్ తెలిపారు. గురువారం  ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎస్.కె లతీఫ్  సంతాప సభ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇగ్బాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంతాప సభకు హాజరైన ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఏం డి జహంగీర్ మాట్లాడుతూ.. ఎస్కే లతీఫ్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి హక్కుల కోసం పోరాటం మొదలై తాను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత జిల్లాలో మైనారిటీల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.

మైనార్టీల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తూనే సిపిఎం  లో క్రమశిక్షణ కలిగిన కామ్రేడ్ గా తుది శ్వాస వరకు నడిచారని ఆయన అన్నారు. తెలంగాణలోని ముస్లిం సంచార జాతుల సమస్యలపై అధ్యయనం చేసి సంచార జాతుల సమస్యలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సమస్యలను పరిష్కరించాలని మొదటగా పోరాటం ప్రారంభించిన వ్యక్తి అని అన్నారు. అనంతర కాలంలో సంచార జాతుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వాలు వాటి సమస్యల పరిష్కారం కోసం తప్పని పరిస్థితులు వచ్చాయన్నారు. సమస్య ఎక్కడ ఉన్నా వాటిని శోధించి అధ్యయనం చేసి ఆ సమస్య వల్ల పీడించే వాడుతున్న ప్రజలను ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్లే గొప్ప నాయకత్వం కలిగిన వ్యక్తి అని ఆయన ఈ సందర్భంగా ఎస్.కె లతీఫ్ తీరును కొనియాడారు.

ఎస్కే లతీఫ్  జీవితం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని తను అనేక కార్యక్రమాలలో బాధ్యత వహించి కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజా విరాళాలు సేకరించినప్పుడు  ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క చెప్పి ఆదర్శంగా నిలిచే వారన్నారు. తన మనసులో ఎలాంటి మలినం లేకుండా ఒక పసిపిల్ల వానీ మనసు వలె ప్రజలను కలుపుకునీ పోయే మనిషి మళ్ళీ పుట్టడం కష్టమని నేటి తరం ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న కాలం నుండి కవిత హృదయం కలిగిన వారని సమస్యలను కవితల రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లడం తన కవితల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలను కాజోల్ముఖలను చేయడం ఆయనకే చెల్లిందన్నారు. అతను రాసిన అనేక కవితలు పాటలు ఈ సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను తెలుపుతాయని అన్నారు.

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడమే ఎస్కే లతీఫ్ గారికి నిజమైన నివాళి అని అన్నారు. పట్టణంలోని అనేకమంది ముస్లిం మేధావులు, ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులు కవులు హాజరై ఎస్కే లతీఫ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సమాజం పట్ల ఎస్కే లతీఫ్ కి ఉన్న నిబద్ధతను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎండి పాషా ఎండి సలీం, షేక్ ఇమామ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,  మైనార్టీ నాయకులు షేక్ మీరా, ఇక్బాల్ చౌదరి, మీర్ హమీద్ పాషా, మీరు యూసుఫ్ అలీ, ఎండి షాబుద్దీన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి  మల్లేశం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు,  గడ్డం వెంకటేష్, వడ్డెబోయిన వెంకటేష్, ఎండి షాబుద్దీన్ పాత్రికేయులు, సుజావుద్దీన్ ఎండి రషీద్ ముక్తార్ హుస్సేన్,  పల్లెర్ల అంజయ్య, దయ్యాల నరసింహ, మాయకృష్ణ, లలిత, మధ్య పురం రాజు, ఎండి సాజిద్, ఎండి సైఫ్, సాయిని కళ్యాణ్   పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -