Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాం..

ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాం..

- Advertisement -

ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం..
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ..
నవతెలంగాణ – తిమ్మాజిపేట

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ముస్లింలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామా మస్జీద్ పై అంతస్తు స్లాబ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మస్జిద్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మస్జిద్ కమిటీతో పాటు ముస్లిం సంఘాల పెద్దలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ముస్లింలకు అండగా ఉంటామని అవసరమున్న ఆపద ఉన్న వెన్నుదన్ను గా ఉంటానని ముస్లింలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ముస్లింలు పవిత్రంగా భావించే మస్జిద్ దర్గా ఈద్గాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పటికీ ఉంటుందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోని దర్గాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని ఈ సందర్భంగా సందర్భంగా హామీ ఇచ్చారు. అదేవిధంగా జామా మస్జిద్ సెల్లార్ పనులు పూర్తి చేయడమే కాకుండా మస్జిద్ నిర్మాణ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయించే బాధ్యత తానే తీసుకుంటానని ముస్లింలకు ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక పథకాలతో ముందుకు పోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోకాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

ముస్లింల సహకారం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఖాదర్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. జమా మస్జిద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం సంఘాల పెద్దలు మొహమ్మద్ సాదిక్ పాషా, యాకూబ్ బావజీర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, మాజీ కౌన్సిలర్స్ మహమ్మద్ నిజాం, మాజీ ముషావిరత్ కమిటీ అధ్యక్షుడు హబీబ్ ఖాన్ తదితరులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల సంక్షేమాన్ని కోరుకునే మీకు మీరు చేసే అభివృద్ధి పనులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల పెద్దలు, వివిధ మస్జిద్ కమిటీల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -