Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం..

అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అనుముల మండల ఐసీడీ ఎస్ పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తి సెక్టారు లోని చాలకుర్తి గ్రామం  అంగన్వాడీ కేంద్రం లోగురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం కోసం అన్నప్రాశన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా, ‘పెరటి తోట’ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.ఇంటి వద్ద పెంచే కూరగాయలు, ఆకుకూరల వల్ల కుటుంబాలకు పోషకాహారం లభిస్తుందని, ఇది పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతుందని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఏసీడీపీఓసువర్ణ మాట్లాడుతూ.. అధికారులు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని, ఇందుకోసం తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూ పర్ వైజర్ గౌసియా బేగం,అంగన్వాడీ టీచర్ శాంతమ్మ,ఆయా పద్మ లబ్ధిదారులు,గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -