నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం..
నవతెలంగాణ – బిచ్కుంద
గత ఐదు నెలల క్రితం ఏర్పాటైన బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక దృష్టి సారించి కమీషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి 15 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్ గంగాధర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంక్షేమ కోసం విద్యా, వైద్యం, ఇల్లు లేని వారికి ఇండ్ల మంజూరు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది అన్నారు.
సీసీ ఇతర రోడ్ల నిర్మాణం కోసం ఐదు కోట్లు, మున్సిపల్ భవన నిర్మాణం కోసం మూడు కోట్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం మూడున్నర కోట్లు, కల్వర్టుల నిర్మాణం కోసం ఒక కోటి 50 లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం రెండు కోట్లు మొత్తం 15 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతాయని త్వరలో ఎమ్మెల్యే కృషితో మరో రూ.10 కోట్లు మంజూరు కానున్నాయని మొత్తం రూ.25 కోట్ల నిధులతో బిచ్కుంద మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయని నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయనతోపాటు నాయకులు విట్టల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బొగడమీద సాయిలు, అసద్ అలీ, షెట్కర్ సాహీల్, నాగ్నాథ్ పటేల్, ఖలీల్, తుకారాం, శంకర్ పటేల్, ధర్పల్లి దశరథ్, దర్పల్ సంజూ, యోగేష్ గుప్తా, బాలకృష్ణ, సాయిని అశోక్, కార్యకర్తలు ఉన్నారు.
బిచ్కుంద మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES